సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చి పడేస్తున్న క్రిమినల్ లాయర్ అచ్యుత్ కు హైకోర్ట్ జడ్జ్ నుండి ఫోన్ రావడంతో విస్తుపోయాడు.తనకూ ఆ జడ్జ్ గారికి అస్సలు పడదు. ప్రొఫెషనల్ గానే కాదు వ్యక్తిగతంగా చాలా ముక్కుసూటిగా ప్రవర్తించే తన మనస్తత్వం, సదరు జడ్జ్ కి అస్సలు నచ్చదు.ఒక్కో సారి తన ప్రవర్తనతో విసుగెత్తి పోయిన ఆయన గారు డైరెక్ట్ గా మొహం మీదే చీవాట్లు పెట్టేవాడు.తనూ వితండవాదం చేస్తూ నెగ్గుకు వచ్చేసేవాడు.అటువంటాయన తనకు ఫోన్ చేయడం కాస్త ఆశ్చర్యం కలిగించింది.
చప్పున ఫోన్ తీస్తూ నమస్తే సార్ . . .చెప్పండి అన్నాడు.
Judge :- నీతో ఒకసారి మాట్లాడలయ్యా ..ఒకసారి ఇంటికి రాగలవా
అచ్యుత్ కు ఇదింకా ఆశ్చర్యం కలిగిస్తుండగా . . .వై నాట్ సార్. . .చెప్పండి ఎప్పుడు రమ్మంటారు అన్నాడు
Judge :- ఇప్పుడే బయలు దేరు. . విషయం కొంత సీరియస్ అర్జంటుగా మాట్లాడాలి అన్నాడు.
అలాగేనండి వస్తున్నా అని వెంటనే బయలు దేరి హైకోర్ట్ జద్జి ఇంటి దగ్గర వాలి పోయాడు అచ్యుత్.