అసలు కథ – Part 10

0
65

ఇంటికెళ్ళంగానే చేతిలో షాంపైన్ బాటల్ పట్టుకొని వీళ్ళ కోసమే గరుడచారి ఎదురు చూస్తూ ఉన్నాడు.

నాన్నను చూడగానే గగన్ కు చిన్నగా వణుకు బయలు దేరింది.
అహన నేరుగా వెళ్ళి సోఫాలో కూచొంటూ వాళ్ళిద్దరినీ ఎదురుగా కూచోబెట్టి గరుడచారిని ఉద్యేశించి , ఇదిగోనండీ మీకు మాటిచ్చినట్టుగా ఇద్దరు పిల్లలనూ తీసుకొచ్చాను.అంది
చారి పెళ్ళిబట్టలతో పూలబుట్టలా కనిపిస్తున్న మోహన వంక తేరిపార జూస్తూ ఏవమ్మాయ్ . . .ఏవూరు మీది? ఎక్కడ చదువుకొన్నవ్? ఎంతదాకా చదువు కొన్నవ్? మావాడు ఎప్పటి నుండి పరిచయం. . . అని వరుసగా ప్రశ్నలేసాడు.
గగన్ నోరు తెరచి ఏదో చెప్పబోతూ ఉంటే చేయెత్తి అతడ్ని ఆపుతూ అంకుల్ నాకు తల్లిదండ్రులేవ్వరూ లేరు. . .పెద్దగా చదువుకోలేదు కూడా . . .విరాజపట్నం దేవదాసీల కుటుంబంలో పెరిగాను. పెళ్ళేయ్యంతవరకూ ఊరి దేవుడి సొత్తుగా ఉన్నాను.
చారి అహన లిద్దరూ షాక్ తిన్నారు ఆమె మాటలకు. . .
చారి నమ్మలేనట్టుగా అంటే నువ్వు . . . భోగం సానివా అన్నాడు కష్టంగా
అవును పెళ్ళేయ్యంతవరకూ
అహన ఛీ అంది ఈసడింపుగా
గగన్ కలవరపడుతూ అమ్మా నాన్నల వంక జూస్తుంటే
చారి . . .విలవిల్లాడుతూ ఏరా గగన్ నీకు ఇంతకంటే వేరే అమ్మయి దొరకలేదా. . . కోట్ల రూపాయిల ఆస్తులకు వారసుడివి. . .నీవు కోరుకొంటే దేశంలోని పెద్ద శ్రీమంతుల కుటుంబాల పిల్లలు నిన్ను

ఆయన పొంగిపోతూ ఇగొ నమ్మా అక్కడ ఆ చివర్లో ఉన్నదే గగన్ గది, ఇప్పుడే శుభ్రం చేసి వస్తున్నాను . . .మీరెళ్లండి అని దారి చూపాడు.
చెంగు చెంగున దూకుతూ గగన్ గదిలోనికి పరిగెత్తింది.
ఆమె రీఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూచోగానే తువ్వాలుతో ఉన్న గగన్ ప్రక్కనుండి ఆమెను చుట్టుకొనేసాడు.

గట్టిగా కేక వేయబోయి . . .గగన్ అని అర్థం కాగానే తనూ అతడ్ని చుట్టుకొనేస్తూ ముద్దులు పెట్టేసింది.
ఆమె ముద్దులకు ఉక్కిరి బిక్కిరైపోతూ . . .ఏం మేడం అంత ముద్దొస్తున్నానా అని ఆమెను ఇంకా దగ్గరకు లాక్కొన్నాడు.
మరీ రావా. . . నా ముద్దుల మొగుడు నావల్ల ఎంత కష్టపడాలో అని బెదిరిపోయాను. మొత్తానికి అమ్మా నాన్నలు మనల్ని ఒప్పుకొన్నారుగా . . . అందుకే ఈ మురిపెం అంతా. . . అని అతడి బుజాన్ని కొరికింది.
గగన్:- అబ్బా అంటూ ఆమె నడుం మీద గిల్లాడు.
ఇదిగో అబ్బాయ్ . . .నడు మీద గిల్లడాల్లాంటి వాటికి పర్మిషన్లు లేవు అంది మూతి బిగిస్తూ . . .
గగన్ :- మరి దేనికి పర్మిషన్లు ఇచ్చినట్టో అని ఆమె క్రింది పెదవిని పట్టుకొన్నాడు.
పెదాలు కూడా పట్టుకోకూడదు.
గగన్ ఆమె ముక్కును పట్టుకొని పిండి మరి దీనికో అన్నాడు
మోహన కూడా గగన్ కూడా ముక్కును పిండి ముక్కు కూడా పట్టుకోకూడదు అని తల విదిలించింది.
గగన్ ఆమె గడ్డం కొరుకుతూ మరి దీనికో అన్నాడు.
ఊ . . .అందే కాని బదులు పలుకలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here