రాత్రి పది గంటల వరకూ ఒంటరిగా అవమాన భారంతో ఊరంతా బలాదూరుగా తిరిగి తిరిగి ఒక నిర్ణయానికొచ్చింది అహన.
మరునాడుదయాన్నే చారి గగన్ లతో పాటు మోహన కూడా బయలు దేరుతూ ఉంటే పట్టుబట్టి ఆపేసింది. దాంతో చారి గగన్ లిద్దరూ చేసేదేమీ లేక మోహనను అహన ఇంటిలోనే వదలి తామిద్దరూ ఆఫీసుకెళ్ళిపోయారు.
మోహనకు కాస్త చిత్రంగా అనిపించినా చూద్దాం. . .ఆంటీనే కదా ఆపింది తనే ఏదో చెబుతుందిలే అనుకొని గమ్మునుండిపోయింది.
పదిగంటల ప్రాంతంలో మోహనను తన గదిలోనికి పిలిచింది.
మోహన పోనీ టైల్ లా జుట్టు వెనక్కి కట్టుకొని లూజుగా ఉండే టీ షర్ట్ లోనికి లూజుగా ఉండే కాటన్ షార్ట్ వేసుకొని ఉంది. అలా జుత్తు వెనక్కి కట్టుకోవడంవల్ల పెద్ద పెద్ద కళ్ళతో మొహం మరింత గుండ్రంగా కనిపిస్తూ ఉంది.
అహన గదిలోనికెళ్ళేసరికి అహన కూడా ఇంచుమించు అదే డ్రెస్సులో ఉండి టీ షర్ట్ ను షార్ట్ లోపలకేసుకొని బెల్ట్ పెట్టుకొని ఉంది.
మోహన గదిలోనికి రాంగానే చనువుగా చేయిపట్టుకొని తీసుకొని వెళ్ళి బెడ్ మీద కూచోబెట్టుకొంది.