అలా షిల్లాంగ్ లో దిగీ దిగంగానే ఒక బ్లాక్ ఆడి కార్ ఇతని కోసం వెయిట్ చేస్తూ ఉంది. అచ్యుత్ తనని తాను పరిచయం చేసుకొని కారులో బయలు దేరుతూ కారంతా కలయజూసాడు. హై ఎండ్ ఆడి కార్ అది కార్ ముందు బ్యానెట్ పై మోహన అని M లోగోతో వ్రాయబడి ఉంది.లోపల సీట్లు కూడా చాలా కంఫర్ట్బుల్ గా ఉన్నాయి.ఎదురుగా డైలీ న్యూస్ పేపర్, ఒక వీక్లీ పుస్తకం పెట్టబడిఉంది. ప్రక్కనే నీళ్ళ బాటిలు, కొన్ని చాక్లెట్ లు పెట్టబడి ఉన్నాయి. ఎడం వైపున నాలుగైదు రకాల సిగరెట్ ప్యాకులు పెట్టబడి ఉన్నాయి. నెలకు25లక్షలు దొబ్బుతోంది కదా ఆమాత్రం ఏర్పాటు చేయక పోతే కస్టమర్లు రారు పాపం అని లోలోపల కుళ్ళుకొన్నాడు అచ్యుత్.
ఇంతలో డ్రైవర్ చిన్నగా దగ్గి , సార్ మీరు చాలా లక్కీ అన్నాడు.
ఎందుకు?
D;- సాధారణంగా వేరే వాళ్ళకు తన పర్సనల్ కారు పంపదు. మేడం దగ్గర ఉన్న సుజుకి హుండయ్ కార్లను పంపుతుంది.
అహా అని ఊరుకొన్నాడు. కాని లోపల మాత్రం కస్టమర్లను పడేయడానికి ఇదో రకమైన పబ్లిసిటీ కావచ్చు అనుకొన్నాడు.
అలా మాటల మధ్యలోనే కారు మోహన అని పేరుగల ఒక పెద్ద ఫాం హౌస్ లోప్లకు వెళ్ళి అందులో గల ఒక పెద్ద బంగళా ముందు ఆగింది. బంగళా ముందు కూడా మోహన అని అందంగా చెక్క బడి ఉంది.
ఈ మోహన ఎవరో అనుకొంటూ లోపలకు దారి తీసాడు.