హాయ్ ఫ్రెండ్స్ .. నేను మీ raams.. ఈ కథ కేవలం కల్పించి రాస్తున్న.. ఇందులోని పాత్రలు అన్ని కల్పితాలే.. ఇక కథ లోకి..శ్రీకాంత్ కు తను అనుకున్న సాఫ్ట్వేర్ కంపెనీ లో జాబ్ వస్తే అమ్మోరు తల్లికి గుడికి వచ్చి మొక్కు తీర్చుకుంటానని మొక్కు కున్నాడు.వాళ్ళ ఊరినుండి 30 కిలోమీటర్ల దూరంలో.. ఆదివాసీ గూడెంలో ఉంటుంది అమ్మ వారి గుడి. అక్కడి అమ్మవారు చాలా మహిమ కలది.
ప్రతి పున్నమికి అమ్మవారి పూజలు చాలా ఘనంగా జరుపుతారు అక్కడి ఆదివాసి పూజారులు.మొక్కు తీర్చుకొని ఆరోజు అక్కడే రాత్రి నిద్ర చేసి తిరిగి మరుసటి రోజు ఉదయం కొలనులో స్నానం చేసి తడి గుడ్డలతో అలాగే వెళ్లి దర్శనం చేసుకుంటే మొక్కు తీరిన్నట్లు. శ్రీకాంత్ ఆ రోజు సాయంత్రం దర్శనం కోసం తన బైక్ ఫై ఆ గూడెం కు బయలుదేరాడు. మొత్తం అడివిలో ప్రయాణం అందుకే దారిలో తినడానికి కొన్ని పార్సెల్ తీసుకోని బయలుదేరాడు. అడవిలో ప్రయాణిస్తుంటే మనసు ఉల్లాసంతో హుషార్ మొదలై స్పీడ్ పెంచాడు.