నా పేరు చిన్న నేను పుట్టిన రెండు సంవత్సరాలకు అమ్మ చనిపోయింది నాకు ఆరు సంవత్సరాలకు వయసు అప్పుడు అమ్మ మీద బెంగతో నాన్నా చనిపోయాడు …
మా ఊరి పెద్ద మనిషి వ్యాపార వేత్త అయిన శ్రీనివాసరావు గారు అయిన సహాయంతో నడిచే అనాధ ఆశ్రమంలో నన్ను చేరిపించారు …..
నేను చదువులో యావరేజ్ స్టూడెంట్ ని అనాధ ఆశ్రమం లో టెన్త్ క్లాస్ వరకు మాత్రమే చదువుకోవడానికి ఉంది ఆ తర్వాత చదువు కోవలను కుంటే బయటి వ్యక్తుల సహాయం మీద ఆధారపడాలి ………
టెన్త్ ఎగ్జామ్స్ ముందు శ్రీనివాసరావు గారి అబ్బాయిలు ఇద్దరు అమెరికా కి చదువు కోవడానికి వెళ్ళి అక్కడే పెళ్లిళ్లు చేసుకొని రావు గారిని ఆయన భార్య ను తీసుకొని వెళ్ళడానికి వచ్చారు రావు గారు నాకు అమెరికా రావడం ఇష్టం లేదని తెగేసి చెప్పడంతో ఆస్తులను అమ్మకానికి పెట్టారు … ఆస్తులన్నీ భార్య పిల్లల పేర్లు ఉండడంతో రావు గారు కూడా ఏమీ చేయలేక పోయాను అబ్బాయిలు ఇద్దరు ఆస్తులు అన్ని అమ్మేసి తండ్రి పేరుతో ఒక ఇల్లు ఒక వ్యాపారాన్ని వదిలేసి అమెరికా వెళ్లిపోయారు వెళుతూ వెళుతూ వాళ్ళ అమ్మను కూడా తీసుకు పోయారు రావు గారు అనాధ ఆశ్రమం కోసం ఇక్కడే ఉండిపోయారు