రాజకోట రహస్యం 1

0
449

Telugu Sex Stories గుర్రపు డెక్కల చప్పుడు ఆ చీకటిలో స్పష్టముగా వినపిస్తోంది. మధ్యలో గుర్రపు సకిలింత క్రమ క్రమంగా దగ్గర కాసాగింది. ఊపిరి బిగబట్టాడు విక్రముడు. ఏక్షణానైనా దాడి చేయడానికి సిద్దంగా దట్టీలోని చురికను చేత పట్టుకుని సిద్దంగా ఉన్నాడు. ఒకవైపు గుండెలదురుతున్నాయి, మరో వైపు రక్తం ఉక్రోషముతో పొంగుతోంది. ఒకవైపు పట్టుదల మరో వైపు ఆందోళన అతన్ని చుట్టు ముట్టాయి. ఆ చిమ్మ చీకట్లో లీలగా అతని గుర్రపు రూపం కనపడుతోంది, అది నెమ్మదిగా దగ్గర కాసాగింది. తాను గుర్రము మీద వ్యక్తి కనపడే ఆస్కారం లేదు. నల్లటి బండరాతి వెనక దాక్కుని ఉన్నాడు తను. తన దుస్తులు కూడా పూర్తిగా నలుపే. తల మీద ముసుగు కూడా ధరించి ఉండడం మూలాన తాను కూడా బండరాయి అనే భ్రమ కలిగించే ఆస్కారమే ఎక్కువని అతనికి తెలుసు.

గుర్రం బండరాయి దగ్గరకి రాగానే, “జై కరాళీ” అంటూ విరుచుకు పడ్డాడు ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తిపై. ఆ అకస్మిక దాడికి గుర్రం మీద వ్యక్తి నిస్చేష్టుడైనట్టు ఉన్నాడు. కంగారులో తన ఖడ్గాన్ని అందుకోవడం రెప్పపాటు ఆలశ్యం చేశాడు. ఆ ఆలశ్యానికి భారీ మూల్యం చెల్లించుకున్నాడు.