పొద్దున్నే మొబైల్ బీప్ తో లేచి కూర్చున్నాడు కేశవ.
మెసేజ్, ఇంత పొద్దున్నే ఎవర్రా…………? అనుకుంటూనే లేచాడు.
అదేదో ఇంటర్నేషనల్ నెంబర్ నుండి వచ్చింది. ఈ మధ్య లాటరి తగిలింది అంటూ తెగ విసిగిస్తుంటాయి కదా అలానే అనుకోని ఆ మెసేజ్ని ఇగ్నోర్ చేశాడు. మళ్ళీ వచ్చింది. దాంతో చూడక తప్పలేదు. ప్లీజ్ కం to ఫేస్బుక్ అని ఉంది.
వెంటనే లాప్ టాప్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యాడు.
Cathy: హాయ్, నా పేరు Cathy smith ., మీరు పంపిన ప్రపోసల్ గురించిమాట్లాడదామని చేశాను, మీరు comfortable గానే ఉన్నారా?!”
కేశవ్ : “comfortable mam”
Cathy : “don’t call me mam, కాల్ మీ కాథీ, మీరు మీ ప్రపోసల్ అండ్ ఎస్టిమేషన్, అవసరమైన సమయం ఇంకా మిగిలిన వివరాలు మెయిల్ లో పంపిస్తాను. మీకు అగ్రిమెంట్ అండ్ ఫిగర్ నచ్చితే……తెలియజేయండి.
కేశవ, కాథీ అడిగిన అన్ని విషయాలకీ తగిన సమాధానాలూ, ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి డౌట్స్ క్లియర్ చేశాడు.
ఛాట్ జరుగుతున్నంతసేపు కాథీ నవ్వుతూ….. చాలా ప్లేసేంట్గా మాట్లాడింది.