అహన ఇంటికొస్తూ క్లబ్ దగ్గర్ తనతో జోస్న మాట్లాడిన మాటలను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకొంటూ ఉద్వేగపడుతోంది.
మోహన విశయం పూర్తిగా విన్నాక జోస్న చాలా తేలిగ్గా కొట్టిపారేస్తూ దీనికంత హైరానా పడాల్సిన అవసరం ఏముంది అహనా .. .. నీకు గల ఇబ్బందులను డైరెక్ట్ గా మోహనతో మాట్లాడి వాళ్ళిద్దరినీ వేరుగా ఉంచి కాపురం చేసుకోమనడం ఒకటి. . . మీకు ఒక్కడే కొడుకు కాబట్టి అలా మీ భర్యాభర్తలకు అంగీకారం కాని పక్షంలో నీకొడుకుని ఏదోవిధంగా నీ దారిలోనికి తెచ్చుకొని నీమాట వినేట్లు చేసుకొని ఆరకంగా మోహనను వాడి ద్వారానే వదిలించుకోవడం రెండవది. ఇందులో నీకు ఏది సూటవుతుందో నీవే ఆలోచించుకో. . .లేదంటే మోహన మీదున్న వ్యతిరేకత నిన్ను పూర్తిగా నాశనం చేసేస్తుంది. మీ చక్కటి కాపురాన్ని నీ చేజేతులా నాశనం చేసుకొంటావు.
జోస్న చెప్పింది అక్షరాలా నిజమనిపించి సరేలేవే . . . . చారితో ఓ సారి మాట్లాడి నా తిప్పలేవోపడతాను అంటూ అక్కడినుండి వచ్చేస్తూ. . . జోస్న చెప్పిన దాంట్లో తనకు రెండోదే కరెక్ట్ అనిపించింది.
ఎందుకంటే మోహనను వదలి గగన్ ఉండలేడు. వాడినొదలి తల్లిదండ్రులుగా తాముండలేరు. కాబట్టి గగన్ ను తన దారిలోనికి తెచ్చుకోవడమే కరెక్ట్ . . .ఎటూ సావంత్ వల్ల తాను సగం చెడింది. ఆ విశయం గగన్ కు కూడా తెలుసు కాబట్టి ఏదొ రకంగా వీడిని తాను దారిలోనికి తెచ్చుకోవాలి. . .ఎలా. . . ఎలా . . . .అనుకొంటూ ఇంటికి బయలు దేరింది.