సాయత్రం జయ కి తల దువ్వుతూ ఉంటే-వాణి లేచి వచ్చింది. జయ జుత్తుని పాయలుగా చేసి-దువ్వి ముడి చుడుతూ ఉంటే”ప్రసాదూ ఎవరికి తల్దువ్వు పేలు చూసినా జడ వేసిన తరవాత ఎక్కువగా కొట్టుకొనేవాడివి” అంది. “ఇంకెవరు జయే అన్నా జయ మెడ మీద ముద్దు పెడుతూ. జయ కి ముడి వేసాక-వాణీ లంగా జాకెట్టులో వచ్చి కూర్చొంది.
ముడి విప్పి వాణి జుత్తుని చేతి వేళ్ళతో సవరిస్తూ-పెద్ద పళ్ళ దువ్వెనతో చిక్కు లేకుండా దువ్వి-తలకి కొంచెం నూనె రాసి-” వాణీ కొత్తగా ముడి వెయ్యనా” అంటే-“నా జుత్తునీ చేతిలో పెట్టా ,నీ ఇష్టం బాబూ ” అంది. వాణి జుత్తుని దువ్వుతూ “జయా ఎలాంటి ముడి వెయ్యనే ” అంటే-“ఎడం పాపిడి తీసి ముడి-ముడిచుట్టూ జడని చుట్టు “అంది. “అవునులే నీకు జయ ఎలా చెబితే అదే వేదం”అంది వాణి. ” అవును వాణీ-తను నాచేత మొదటి సారి పేలు తీయించుకొని-తల దువ్వుంచుకొని-జడ వేయించుకున్నా నాటి నుంచీ-మా ఇద్దరికీ కలిసింది. మీకెవరికీ తెలీదు-జయ అప్పుడప్పుడు నన్ను పిలిచి తలంటు కూడా పోయించుకొనేది-ఇద్దరికి అప్పుడే ప్రేమ కలిగింది-కానీ వయస్సు పెద్దవాళ్ళు ఒప్పుకోరని తెలుసు-అయినా బొబ్బిలిలో నేను ఉన్నన్నాళ్ళు ఇద్దరం కలిసి చాలా టైం గడిపాము”అని దువ్విన జుత్తుని ముడి గా వేసి-మిగిలిన జుత్తుముడిలోంచి బైటకు లాగా.