TV19 లో వార్తలు సన్నగా వినబడుతున్నాయి. ఇంకా పూర్తిగా తెల్లారలా, ఉదయం 5:30 అయ్యింది. హైదరాబాద్ నగరం మాత్రం ఎప్పుడో మేలుకొంది కానీ నీరజా వాళ్ళు ఉంటున్న ఇల్లు ట్రాఫిక్ జాం లకి దూరంగా పచ్చదనానికి దగ్గరగా ఉండబట్టి ఉదయం ప్రశాంతంగా ఉంది. నీరజ అప్పుడే నిద్రలేచి హాల్ లోకిబద్దకంగా నడుచుకుంటూ వచ్చింది. బాల్కనీ అద్దంమీద లేత వెలుగు పడుతోంది కానీ అద్దానికి పూర్తిగామంచు పట్టి బైట ఏమీ కనబడడం లేదు. సన్నగా వాన పడుతున్న గుర్తుగా అద్దం మీద మాత్రం అక్కడక్కడా నీటి చారికలు కనబడుతున్నాయి. న్యూస్ లో ఒక అందమైన అమ్మాయి నవ్వుతూ రాష్త్రం లొ జరిగే అరాచకాలన్నీ మనసుకి హత్తుకునేటట్టు చెబుతోంది.
వెదర్ రిపోర్ట్ అనగానే నీరజ చూపులు ఆ అమ్మాయి మీదకి మళ్ళాయి. నీరజకి అప్పుడే 15 ఏళ్ళు నిండాయి, లేత మొగ్గ. తల్లి చాటు పిల్ల, నీరజ కి అన్నీ వాళ్ళ అమ్మే.అమ్మ ఎలా చెబితే అలా వింటుంది. నీరజ తల్లి కల్యాణి చాలా చురుకైన ఆవిడ. 36 సంవత్సరాల వయసులో అన్ని పనులూ చక చకా చక్కబెడుతూ ఇంట్లో తలలో నాలికలా ఉంటుంది. అమ్మ ని అడగందే నీరజ ఏ పనీ చెయ్యదు, వాళ్ళిద్దరూ తల్లీ కూతుర్లకంటే మంచిస్నేహితులుగా మెలుగుతారు. నీరజకి ఒక తమ్ముడు, వాడికీ నీరజకి వయసులో కేవలం రెండేళ్ళ తేడా అంతే. తండ్రి వినీల్ ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ కి మెడికల్ డైరెక్టర్, పేరు తో పాటు బాగాడబ్బున్న ఫామిలీ.
వినీల్ కి ఎక్కువ ఆడంబరాలు ఇష్టం ఉండవు, డబ్బులు దుబారాగా ఖర్చు పెట్టడంకూడా ఇష్టం ఉండదు. అందుకే నీరజని, కొడుకు వెంకట్ ని లోకల్ ట్రైన్లోనే కాలేజీ కి పంపుతాడు. నీరజా, వెంకట్ ఒకే కాలేజీ లో చదువుకుంటారు కాబట్టి ఇద్దరూ కలిసే కాలేజీ కి వెళ్ళి వస్తూ ఉంటారు. “విశాఖపట్టణానికి తూర్పుగా బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది, వచ్చే 24 గంటలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాబావం ఉందని వాతావరణ శాఖ కార్యదర్శి కృపాలింగం గారు చెప్పారు..” ఆ అమ్మాయి అన్నీ నవ్వుకుంటూ చెప్పుకుపోతుంటే నీరజ నవ్వాపుకుంది. కల్యాణి టిఫిన్ చెయ్యడం పూర్తి చేసేసింది, ఒక సారి బైటికి తొంగిచూసి.